Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Monday, 21 December 2015

Dt.01-01-2016 , 7th CPC implementaion day

తేది: 01-07-2016 నుండి రాబోవు ఇంక్రిమెంట్ కొరకు నూతన 7 వ వేతన సంఘ వేతనము తేది: 01-01-2016 నుండి 6 నెలలు కొనసాగా వలసి ఉండును. తేది: 01-01-2016 తో సహా ఎన్ని రోజులు సెలవులో ఉన్ననూ తదుపరి ఇంక్రిమెంటు తేది: 01-07-2017 నుండి మంజూరు ప్రమాదము ఉన్నది. కనుక ప్రతి ఉద్యోగి తేదీ : 01-01-2016 న డ్యూటీ లో ఉండునటుల జాగ్రత్త వహించ వలసినది గా కోరుచున్నాము. 



Courtesy : sapost.blogspot.in

01-01-2016 , 7th CPC implementation day

Be Careful : జాగ్రత్త సుమా
తేది 01-01-2016,  7 వ వేతన సవరణ అమలు తేదీ.
ఈ తేదీ న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ డ్యూటీ లో ఉండుట తప్పని సరి.
కనుక సెలవులో వున్నవారు తప్పని సరిగా డ్యూటీ లో చేరుట ఎంతో అవసరము.
గమనించ గలరు.
సెలవులో ఉన్న సహోద్యోగులకూ , మిత్రులకూ ఈ విషయము పై అవగాహనా కల్గించండి.

Please be on duty on the day of 7th CPC implementation
i.e. 01-01-2016
to avoid problems in pay fixation.
Those who are on leave , please curtail your leave and join so as to be on duty on dtd.01-01-2016
 
 

Tuesday, 15 December 2015

తస్మాత్ జాగ్రత్త



ఢిల్లీ లోని కోర్ బ్యాంకింగ్ పోస్ట్ ఆఫీసు లలో ఉద్యోగుల పాస్వర్డ్ తో ఫినకిల్ ప్యాకేజ్ లో కి లాగిన్ అయి పెద్దమొత్తం లో అవకతవకలు జరిగినట్లు తెలియుచున్నది. ఇన్ఫోసిస్ ఉద్యోగుల పేరున సహాయం చేయుటకు వచ్చిన వ్యక్తులు మన ఉద్యోగుల అమాయకత్వము ను ఆసరాగా చేసికొని ఈ అవకతవకలకు పాల్పడినట్లు తెలియవచ్చుచున్నది. కనుక ఈ విషయములో మనం పోరాడుటకు ముందు మన విషయములో జాగ్రత్త గా ఉండుట తప్పనిసరి. ఎటువంటి పరిస్తుతులలో కూడా మీ పాస్వర్డ్ లు ఇతరులకు ఇవ్వవద్దు. మీరు మీ పాస్వర్డ్ తో లాగిన్ అయి వేరొకరికి సిస్టం అప్పగించవద్దు. పని నేర్చుకొనుట కంటే అవకతవకలలో చిక్కకుండా చూసుకొనుట ఎంతో ముఖ్యము.
ఈ విషయుములో తపాలా శాఖ సర్కులర్ చూడండి.




Courtesy : ipaspandhra.blogspot.in

Sunday, 13 December 2015

Facts & Beliefs

నానుడి           :     సూర్యుడు తూర్పున ఉదయించును, పడమట అస్తమించును.
వాస్తవము         :     సూర్యుడు కదలడు. భూమి మాత్రమే పరిభ్రమించును.

ప్రభుత్వ నానుడి      :  జి డి యస్ లు ప్రభుత్వ ఉద్యోగులు కారు.

వాస్తవం                :   జి డి యస్ లు ప్రభుత్వ కార్యక్రమము లు అమలు చేయుదురు , అదియునూ స్వంత   స్థలము లో స్వంత పూచీకత్తు పై. 



Courtesy : aipeugdsnfpe.blogspot.in

Friday, 11 December 2015

Proposed NJCA indefinite strike in 1st week of Mar-2016

7 వ వేతన సంఘ తిరోగమన నివేదిక కు వ్యతిరేకముగా మార్చి మొదటి వారములో నిరవధిక సమ్మె.
 ముఖ్య మైన డిమాండులు:
1. కనీస వేతనము రూ. 30000- గా నిర్ధారించుట 
2. ప్రతి 5 సంవత్సరము లకు ఒక సారి వేతన సవరణ.
3. జిడి.యస్ లను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించి వేతన సవరణ చేయాలి
4. సంవత్సర ఇంక్రిమెంటు 5% గా పెంచాలి.
5. జనవరి నుండి జూన్ వరకూ నియమింపబడిన వారికి జనవరి లోనూ , జూలై నుండి డిసెంబర్ వరకూ నియమింపబడిన వారికీ జూలై లోనూ ఇంక్రిమెంటు ఇవ్వాలి.
6. రద్దుకు ప్రతిపాదించ బడిన అన్ని అలవెన్సులు తిరిగి ఇవ్వాలి
7. పెన్షను 60% గా నిర్ణయించి ప్రతి 5 సంవత్సరములకు 5% పెంపుదల ఇవ్వాలి.
8. ఉద్యోగ ఆందోళనను పరిగణించి,  మంత్రిత్వ కమిటీ నియమించి వేతన సవరణ అనమలీలు తొలగించాలి.

మరిన్ని వివరముల కొరకు " క్లిక్ " చేయండి.
Courtesy  nfpe.blogspot.in