Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Thursday 27 September 2012

Raise in speed post tarif wef. 1-10-2012

పెరగనున్న స్పీడ్ పోస్ట్ రేట్ లు 

తపాలా స్పీడ్ పోస్ట్ టారిఫ్ రేట్ లు పెరుగనున్నాయి. 1-10-2012 నుండి అమలుకా నున్నాయి.

50 గ్రా. వరకు -- లోకల్ --- రు.15- , 200 కి.మీ. నుండి 35-

50-200 గ్ర. వరకు లోకల్ 25- , 200 కి.మీ. వరకు 35- , 201-1000 కి.మీ.వరకు 40-, 1001-2000 కి.మీ.వరకు 60- , 2000 కి.మీ. పైన 70-.

201- నుండి 500 గ్ర. వరకు ......
లోకల్ 30- , 200 కి.మీ.వరకు 50-, 201-1000 కి.మీ. వరకు 60-, 1001-2000 కి.మీ.వరకు 80- ఆ పైన 90-
 

పైన ప్రతి 500 గ్ర. లకు .....
లోకల్ 10- , 200 కి.మీ.వరకు 15-, 201-1000 కి.మీ. వరకు 30-, 1001-2000 కి.మీ.వరకు 40- ఆ పైన 50-

ప్రభుత్వ ఆదేశముల కొరకు ఎదురు చూడండి.
 

Friday 21 September 2012

UP KEEPING SERVICE BOOK

మీ Service Book up date గా ఉన్నదా? ఒక్కసారి ఈ క్రింది వాటిని సరిచూసుకొనండి.
1. మీ latest family perticulars నమోదు అయినవా?
2. మీ భార్య లేదా భర్త పేరు సరిగా నమోదు అయినదా?
3. మీ భార్య లేదా భర్త పుట్టిన తేది సరిగా ఉన్నదా?
4. మీ భార్య లేదా భర్త పుట్టిన తేది certificate సర్వీసు బుక్కు లో file చేయబడినదా?
5. DCRG నామినేషను నమోదు అయినదా?
6. CGEGIS నామినేషను నమోదు అయినదా?
7. GPF నామినేషను నమోదు అయినదా ?
.......................... జాగ్రత సుమా. ఫై వివరములు service book లో లేనిచో తక్షణమే నమోదు చేయండి. మీ కుటుంబ సంక్షేమానికి పాటుపడండి.


 

Tuesday 18 September 2012

VINAYAKA CHAVITHI GREETINGS

వినాయక చవితి శుభాకాంక్షలు 
ఎవరు ఎక్కువ  ? ఎవరు  తక్కువ ?
స్నేహానికి జాతి,కుల,మత భేదాలు లేవు .అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు .
సర్వేజనా సుఖినోభవంతు .

Saturday 15 September 2012

WINNER OF STAMP DESIGN COMPETATION

2050 లో భారత తపాలా శాఖ స్టాంప్ డిజైన్ పోటీలో జాతీయ స్థాయిలో  బహుమతి పొందిన డిజైను 

2011 లో భారతీయ తపాలాశాఖ నిర్వహించిన స్టాంప్ డిజైన్ పోటిలలో ఫై డిజైన్ జూనియర్ క్యాటగరిలో ప్రధమ బహుమతి పొందినది .2050 లో భారత తపాలాశాఖ ఎలా ఉండబోవుచున్నది అనే భావంతో పోటి నిర్వహించబడినది .2050 సంవత్సరమునకు ప్రపంచ తపాలా సేవలకు 286 సంవత్సరములు పూర్తి అవుతాయి పగటి వేళలలో పావురాలు రాత్రి వేళలలో గుడ్లగూబల సహాయంతో విధుల నిర్వహణ సంకేతంతో తయారు చేయబడినది ."వీధి నుంచి నక్షత్రాల వరకు -ఎపుడు అయిన -ఎక్కడికి అయినా "అనే నినాదం తో తయారు అయినది .
ఈ డిజైన్ తయారు చేసి బహుమతి పొందిన విశాఖపట్నం కు చెందిన " బేబీ హేమశ్రీ భవ్య" కు  అబినందనలు .
మరిన్ని వివరములకు 16-9-12 ఈనాడు దినపత్రిక చూడండి .

Friday 14 September 2012

MACP up gradation will also get allowances

అలవెన్సుల drawl కు MACP up gradation  అడ్డంకి కాదు. రెగ్యులర్ ప్రమోషన్ వచ్చినపుడు మాత్రమే అలవెన్సులు draw చేయుట ఆపివేయాలి. ట్రెజరీ అలవెన్సు, అకౌంటెంట్ అలవెన్సు తదితర అలవెన్సులు ఇప్పుడు MACP వచ్చిన ఉద్యొగులకూ draw చేయవచ్చును. ఇందుకు సంబంధించిన ఆదేశములు వెలువడినవి. మరిన్ని వివరములకు, ఆర్డరు కాపీ కొరకూ  www.nfpe.blogspot.in ను సందర్శించండి.

Wednesday 12 September 2012

AP Circle P3 conferance at Vizainagaram

AP P3 యూనియన్ రాష్ట్ర మహాసభలు విజయనగరం లో సెప్టెంబర్ 9 నుండి 12 వరకు జరిగాయి. ఈ మహాసభలకు NFPE సెక్రెటరీ జనరల్ కా// కృష్ణన్ , P3 జనరల్ సెక్రటరీ కా// శివన్నారాయణ , P4 Chq. ప్రసిడెంట్ కా// షెక్ హుమాయూన్ ,కా// పి.పాండురంగారావు తదితర నాయకులూ హాజరు అయి ప్రసంగించారు.ఈ మహాసభలకు మన డివిజను నుండి ఏడుగురు ప్రతినిధులు హాజరు అయినారు. ఈ మహాసభలలో ఎన్నిక కాబడిన నూతన కార్యవర్గామునకు అభినందనలు. ఈ ఎన్నికలలో మనడివిజన్ నుండి కా// డి.మోహనరావు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరలా ఎన్నిక కాబడినారు. వారికి కుడా అభినందనలు.
 
 

















 

Wednesday 5 September 2012

Wishes to newly elected body of AP circle P4 union

AP P4 సర్కిల్ యూనియన్ కాన్ఫరెన్స్ లో నూతనముగా ఎన్నిక కాబడిన కార్యవర్గమునకు అభినందనలు.మన ప్రకాశం డివిజను నుండి సర్కిల్ కౌన్సిల్ మెంబర్ గా కా// శోభన్ బాబు ఎన్నిక అయినారు. వారికి NFPE ప్రకాశం డివిజను నుండి  ప్రత్యేకముగా అభినందనలు. ప్రకాశం డివిజను సభ్యుల సమస్యలు సాధనకు ఇది ఎంతో ఉపయోగకర పరిణామము.

Monday 3 September 2012

AIPEU Gr-C all India conferance at Trivandrum in March-2013.

P3 యూనియన్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ మార్చ్ 10,11,12 /2013 తేదిలలో కేరళ రాజధాని నగరం "త్రివేండ్రం " లో జరుగును. వెనుక ముందు తేదిలలో కేరళ ప్రకృతి అందాలు దర్శించుటకు మంచి అవకాశము. ఆసక్తి కలవారు కా// కె.వెంకటేశ్వర్లు , డివిజనల్ సెక్రటరి ని సంప్రదిచవలసినదిగా కోరుచున్నాము. వివరములు డిసెంబర్ 2012 లోగా  తెలియచేసిన ,ప్రయాణము సరిగా సిద్ధము చేయుటకు అవకాశము ఉండును. గమనించగలరు.

Sunday 2 September 2012

Applications for Postal Asst. Posts are available on line

పోస్టల్ అసిస్టెంట్ పోస్ట్ ల కొరకు అప్లికేషన్లు on line దొరుకుచున్నవి. www.indiapost.gov.in ను చూడండి.
రిజిస్టర్ చేసుకొనబడిన అభ్యర్ధుల email నకు అప్లికేషను మరియు సంబంధిత kit పంపబడును. ఫీజు రు .250- UCR లో కట్టవలెను. మరిన్ని వివరములకు www.aipeup3chq.com సందర్శించండి.
2-9-12 మధ్యాహ్నం ఒంగోలు హెడ్ పోస్టాఫీసులో  NFPE సమావేశములు కా// ఆర్.బ్రహ్మనందం అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశములకు  డివిజను లోని 40 మందికి పైగా సభ్యులు హాజరు అయినారు.
ముఖ్యముగా జెనరేటర్ సమస్యలు , ఫారముల సప్లయ్ , ఆర్-నెట్ ,స్పీడ్ నెట్ ,ఆదార్ కార్డు డెలివరీ సమస్యలు, లీవ్ సమస్యలు , కంప్యూటర్ ట్రినింగ్ సమస్యలు చర్చకు వచ్హాయి. 25-8-12 సమ్మేపిలుపు తదితర విషయాలు సమర్దిమ్పబడ్డాయి. CITU నాయకులు హాజరు అయి ప్రసంగిచారు. మన పోరాటాలకు సంఘిభావము తెలియచేసారు. సమస్యల ప్రచారము యొక్క ఆవశ్యకత తెలియచేసారు.
కొనసాగింపుగా 10tv  ప్రారంభము గురించి వివరించి పెట్టుబడులను ఆహ్వానించారు. కార్మిక ఐక్యత ఆవశ్యకతను తెలియచేసారు.

Saturday 1 September 2012

Deligates to P4 conferance are on move

Four member deligation from Prakasam Division  started their journey to Circle conferance of AIPEU Postmen & MTS/Gr-D scheduled from 2-9-2012 to 4-9-2012, at Simhachlam (Vishakha)