Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Tuesday, 9 October 2012

POSTAL WEEK 9-10-12 TO 15-10-12

తపాలా వారోత్సవములు 9-10-2012 నుండి 15-10-2012 వరకు 
 
 
 


తేది  9-10-2012 ప్రపంచ తపాల దినము గా గుర్తింపబడిన విషయము మన అందరి కి తెలిసిన విషయమే.
9-10-2012 నుండి 15-10-2012 వరకు ప్రపంచ తపాలా వారోత్సవములు జరుగనున్నవి. తపాలా ఉద్యోగులు గా మనమూ పాల్గొందాము.
Be proud to be a Indian  Postal Employee. We are serving world  lorgest Postal coridar.

Sunday, 7 October 2012

New Postal Policy

నూతన పోస్టల్ పాలసీ 
భారతీయ తపాలా శాఖ ను ప్రయివేటీకరణ చేయుటకు ఉద్దేసించబడినది. దీనిని NFPE తీవ్రముగా వ్యతిరేకించుచున్నది.
ముఖ్యముగా 70 శాతము భారత భారతదేశ జనాభా పల్లెలలో నివసించుచున్న విషయము మరువరాదు. 
 70 శాతము తపాలా ఆదాయము పట్టణములనుండి వచ్చు విష యమూ కాదనలేము. ఈ విధముగా పట్టణములనుండి వచ్చు ఆదాయమే పల్లెలలో తపలసేవలకు వినియోగించబడును. దీనిని cross Subsidy అనవచ్చును. ఈ విధమైన సేవలు ప్రభుత్వ ఆధీనములోని తపాలా శాఖకు మాత్రమే సాధ్యము. తపాలా శాఖలో ప్రయివేటు పెట్టుబడులు అనుమతివ్వబడినచో పట్టణ సేవలకు ప్రాధాన్యత పెరిగి పల్లెలలో సేవలకు కొరత ఏర్పడును.
ఉదాహరణకు Telecom లో పల్లెలలో ప్రయివేటు land ఫోనులు లేనివిషయం మనం గమనించు చున్నాము.
RTC బస్సులు ఎన్ని పల్లెలకు పోవుచున్నవి ? ఎన్ని  ప్రయివేటు బస్స్సులు  పల్లెలకు పోవుచున్నవి?
 అదేవిధముగా తపాల సేవలలో కూడా ప్రయివేటు సంస్థలు వచ్చి పట్టణ సేవలద్వారా ఎక్కువ ఆదాయము పొంది పల్లెల సేవలు పట్టించుకొనవను విషయము తేటతెల్లము. ఆ మిగిలిన పల్లెసేవల భారము ప్రభుత్వ తపాలాశాఖపై పడి  మరింత నష్టమునకు కారణము  అగుట ఖచ్చితము.తద్వారా తపాలా శాఖను నిర్వీర్యము చేయుట దీని ముఖ్యోద్దేశం.
తపాలా శాఖకు ఉన్న monopali ఎత్తివేయుట కూడా పొందుపరచబడినది. ముఖ్య ఆదాయ వనరుగా ఉన్న లెటర్ మెయిల్ ను కూడా ప్రయివేటీకరించుటకు ఎత్తుగడ. కనుక తపాలా ఉద్యోగులు అప్రమత్తతతో దీనిని ఎదుర్కొనుట అవసరము.
రాబోవు పోరాటములకు సిద్ధపడవలసినదిగా కోరుచున్నాము.

Tuesday, 2 October 2012

DA orders released

DA ఆర్డరులు రిలీజ్ అయినవి.
(బేసిక్ పే  (గ్రేడ్ పే తో కలపి)  + TRA ) * 7/100 *3 లెక్కించి మీ DA అరియర్స్ మొత్తము సరిచుసుకొనండి.
మూడు నెలల బకాయిలు ఈ నెలలో( అక్టోబరు-12) పొందుటకు అవకాసము కలదు.
 

Thursday, 27 September 2012

Raise in speed post tarif wef. 1-10-2012

పెరగనున్న స్పీడ్ పోస్ట్ రేట్ లు 

తపాలా స్పీడ్ పోస్ట్ టారిఫ్ రేట్ లు పెరుగనున్నాయి. 1-10-2012 నుండి అమలుకా నున్నాయి.

50 గ్రా. వరకు -- లోకల్ --- రు.15- , 200 కి.మీ. నుండి 35-

50-200 గ్ర. వరకు లోకల్ 25- , 200 కి.మీ. వరకు 35- , 201-1000 కి.మీ.వరకు 40-, 1001-2000 కి.మీ.వరకు 60- , 2000 కి.మీ. పైన 70-.

201- నుండి 500 గ్ర. వరకు ......
లోకల్ 30- , 200 కి.మీ.వరకు 50-, 201-1000 కి.మీ. వరకు 60-, 1001-2000 కి.మీ.వరకు 80- ఆ పైన 90-
 

పైన ప్రతి 500 గ్ర. లకు .....
లోకల్ 10- , 200 కి.మీ.వరకు 15-, 201-1000 కి.మీ. వరకు 30-, 1001-2000 కి.మీ.వరకు 40- ఆ పైన 50-

ప్రభుత్వ ఆదేశముల కొరకు ఎదురు చూడండి.
 

Friday, 21 September 2012

UP KEEPING SERVICE BOOK

మీ Service Book up date గా ఉన్నదా? ఒక్కసారి ఈ క్రింది వాటిని సరిచూసుకొనండి.
1. మీ latest family perticulars నమోదు అయినవా?
2. మీ భార్య లేదా భర్త పేరు సరిగా నమోదు అయినదా?
3. మీ భార్య లేదా భర్త పుట్టిన తేది సరిగా ఉన్నదా?
4. మీ భార్య లేదా భర్త పుట్టిన తేది certificate సర్వీసు బుక్కు లో file చేయబడినదా?
5. DCRG నామినేషను నమోదు అయినదా?
6. CGEGIS నామినేషను నమోదు అయినదా?
7. GPF నామినేషను నమోదు అయినదా ?
.......................... జాగ్రత సుమా. ఫై వివరములు service book లో లేనిచో తక్షణమే నమోదు చేయండి. మీ కుటుంబ సంక్షేమానికి పాటుపడండి.


 

Tuesday, 18 September 2012

VINAYAKA CHAVITHI GREETINGS

వినాయక చవితి శుభాకాంక్షలు 
ఎవరు ఎక్కువ  ? ఎవరు  తక్కువ ?
స్నేహానికి జాతి,కుల,మత భేదాలు లేవు .అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు .
సర్వేజనా సుఖినోభవంతు .

Saturday, 15 September 2012

WINNER OF STAMP DESIGN COMPETATION

2050 లో భారత తపాలా శాఖ స్టాంప్ డిజైన్ పోటీలో జాతీయ స్థాయిలో  బహుమతి పొందిన డిజైను 

2011 లో భారతీయ తపాలాశాఖ నిర్వహించిన స్టాంప్ డిజైన్ పోటిలలో ఫై డిజైన్ జూనియర్ క్యాటగరిలో ప్రధమ బహుమతి పొందినది .2050 లో భారత తపాలాశాఖ ఎలా ఉండబోవుచున్నది అనే భావంతో పోటి నిర్వహించబడినది .2050 సంవత్సరమునకు ప్రపంచ తపాలా సేవలకు 286 సంవత్సరములు పూర్తి అవుతాయి పగటి వేళలలో పావురాలు రాత్రి వేళలలో గుడ్లగూబల సహాయంతో విధుల నిర్వహణ సంకేతంతో తయారు చేయబడినది ."వీధి నుంచి నక్షత్రాల వరకు -ఎపుడు అయిన -ఎక్కడికి అయినా "అనే నినాదం తో తయారు అయినది .
ఈ డిజైన్ తయారు చేసి బహుమతి పొందిన విశాఖపట్నం కు చెందిన " బేబీ హేమశ్రీ భవ్య" కు  అబినందనలు .
మరిన్ని వివరములకు 16-9-12 ఈనాడు దినపత్రిక చూడండి .