Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Saturday, 11 May 2013

A joke on postal services

తపాలా సేవలపై ఒక హాస్య కదంబం. 

చనిపోబోవుచున్న ఒక వ్యక్తితో యమధర్మరాజు :

" చనిపోవు ముందుగ ఒక కోరిక కోరుకొనుము, అదియును నీ ప్రాణము తప్ప."

చనిపోవు వ్యక్తి:

" తపాలా శాఖ ద్వారా వచ్చు నా ఆధార్ కార్డు చూచి చనిపోవు వరము ప్రసాదించండి. "

courtesy: Sakshi weekly


Wednesday, 8 May 2013

Congratulations to Com. M.Krishnan

కా// యమ్. కృష్ణన్ " కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యంప్లాయీస్ "సెక్రటరీ జనరల్  గా ఎన్నిక అయినారు. దీనివలన కేంద్ర ప్రభుత్వోద్యోగుల ఐక్యత మరింత సానుకులము అయినది. కా// క్రిష్ణన్ గారికి అభినందనలు. 

Tuesday, 30 April 2013

May Day 2013

మే డే శుభాకాంక్షలు




8 గంటల పని నిబంధన కొరకు సాగిన ఆందోళనే ఈ మే డే. అమెరికాలో చికాగోలో జరిగిన ఆందోళన గుర్తుగా ప్రపంచ కార్మిక దినముగా గుర్తింప బడినది. రాబోవు మన ఆందోళనలకు ప్రేరణగా మలచుకొని 7 వ వేతన సంఘాన్ని సాధిద్దాము. 
కార్మిక   ఐక్యత  వర్ధిల్లాలి. 

Saturday, 27 April 2013

29-04-2013 demnistrations

50 శాతం DA ను మూలవేతనము లో కలుపుట, GDS ల వేతన 

సవరణతో కూడిన 7 వ వేతన సంఘ నియామకము ను కోరుచూ రైల్వే 

ఉద్యోగ సంఘములు, రక్షణ శాఖ ఉద్యోగులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ 

సంఘముల సమాఖ్య నాయకత్వమున ఆందోళన లో భాగముగా ఈ నెల 

29 వ తేదీ న కేంద్ర ప్రభత్వ కార్యాలయముల వద్ద ప్రదర్సనలకు పిలుపు 

ఇవ్వబదినది. 

దీనికి అనుగుణముగా మన ప్రకాశము తపాలా డివిజను లోని అన్ని 

తపాలా కార్యలయములవద్ద గేటు మీటింగులు, నిరసన ప్రదర్సనలు 

నిర్వహించి వివరములు డివిజను నాయకత్వములకు తెలియ  

చేయవలసినది గా కొరుచున్నము. 

Thursday, 18 April 2013

8% hike in DA

1-1-2013 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA 8 శాతం పెరుగనున్నది. దీనివలన DA 72 శాతం నుండి 80 శాతం గా మారును. ఈరోజు కేంద్ర మంత్రిత్వ సంఘ ఆమోదము అయినది.   

Tuesday, 16 April 2013

Postal Asst., Exam Model paper

డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టల్ అసిస్టెంట్ పరిక్షల మోడల్ పరీక్షా పత్రము ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చును.

http://akulapraveen.blogspot.in/2013/04/postal-assistant-exam-model-cum.html

పరిక్ష తేదీ : 21-04-2013 ఆదివారము 

 

Wednesday, 10 April 2013

UGADI GREETINGS

విజయనామ  సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 




చేదు,తీపి,పులుపు,వగరు,కారం ,ఉప్పుల  కలయికే ఉగాది . 

జి.డి.యస్ ,గ్రూప్-డి ,పోస్టుమేన్ ,గ్రూప్-సి ,అధికారులు ,ఆడిట్ ,యాజమాన్యం కలయికే తపాలా శాఖ . 

ఏది ఎక్కువ ఏది తక్కువ కాదు.  అన్ని తగు పాళ్ళలో ఉంటేనే పండుగ అయినా  వ్యవస్థ అయినా . 

విజయ నామ సంవత్సరంలో  విజయం కొరకు శ్రమిద్దాం . 


తెలుగు సంవత్సరములు