నూతన పోస్టల్ పాలసీ
భారతీయ తపాలా శాఖ ను ప్రయివేటీకరణ చేయుటకు ఉద్దేసించబడినది. దీనిని NFPE తీవ్రముగా వ్యతిరేకించుచున్నది.
ముఖ్యముగా 70 శాతము భారత భారతదేశ జనాభా పల్లెలలో నివసించుచున్న విషయము మరువరాదు.
70 శాతము తపాలా ఆదాయము పట్టణములనుండి వచ్చు విష యమూ కాదనలేము. ఈ విధముగా పట్టణములనుండి వచ్చు ఆదాయమే పల్లెలలో తపలసేవలకు వినియోగించబడును. దీనిని cross Subsidy అనవచ్చును. ఈ విధమైన సేవలు ప్రభుత్వ ఆధీనములోని తపాలా శాఖకు మాత్రమే సాధ్యము. తపాలా శాఖలో ప్రయివేటు పెట్టుబడులు అనుమతివ్వబడినచో పట్టణ సేవలకు ప్రాధాన్యత పెరిగి పల్లెలలో సేవలకు కొరత ఏర్పడును.
ఉదాహరణకు Telecom లో పల్లెలలో ప్రయివేటు land ఫోనులు లేనివిషయం మనం గమనించు చున్నాము.
RTC బస్సులు ఎన్ని పల్లెలకు పోవుచున్నవి ? ఎన్ని ప్రయివేటు బస్స్సులు పల్లెలకు పోవుచున్నవి?
అదేవిధముగా తపాల సేవలలో కూడా ప్రయివేటు సంస్థలు వచ్చి పట్టణ సేవలద్వారా ఎక్కువ ఆదాయము పొంది పల్లెల సేవలు పట్టించుకొనవను విషయము తేటతెల్లము. ఆ మిగిలిన పల్లెసేవల భారము ప్రభుత్వ తపాలాశాఖపై పడి మరింత నష్టమునకు కారణము అగుట ఖచ్చితము.తద్వారా తపాలా శాఖను నిర్వీర్యము చేయుట దీని ముఖ్యోద్దేశం.

తపాలా శాఖకు ఉన్న monopali ఎత్తివేయుట కూడా పొందుపరచబడినది. ముఖ్య ఆదాయ వనరుగా ఉన్న లెటర్ మెయిల్ ను కూడా ప్రయివేటీకరించుటకు ఎత్తుగడ. కనుక తపాలా ఉద్యోగులు అప్రమత్తతతో దీనిని ఎదుర్కొనుట అవసరము.
రాబోవు పోరాటములకు సిద్ధపడవలసినదిగా కోరుచున్నాము.
No comments:
Post a Comment